232 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. రూ. 22.40 లక్షల జరిమానాలు

by Ratna Kumari |

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో నమోదైన 232 కేసుల్లో కోర్టులు రూ. 22.40 లక్షల జరిమానాలు విధించినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.

232 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. రూ. 22.40 లక్షల జరిమానాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో నమోదైన 232 కేసుల్లో కోర్టులు రూ. 22.40 లక్షల జరిమానాలు విధించినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 5 నుండి 9 వరకు వాహన తనిఖీలు నిర్వహించి 232 కేసులు నమోదు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. వీరిలో ఆరుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. ప్రజలెవరూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సీపీ సూచించారు. వాహనాలు నడిపే వారు వారి డ్రైవింగ్ లైసెన్సుతో పాటు, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా తమతో ఉంచుకోవాలన్నారు.

Next Story