పెన్షన్ లో 16 రూపాయలు స్వాహా

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో వికలాంగులు, వితంతులు, వృద్ధులు, బీడీ కార్మికులు పెన్షన్లు సుమారుగా 1,63 వేలమంది లబ్ధిదారులు ఉన్నారు. కొన్ని గ్రామాలలో పైన వస్తున్న 16 రూపాయలు ఇవ్వడం లేదు.

పెన్షన్ లో 16 రూపాయలు స్వాహా
X

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో వికలాంగులు, వితంతులు, వృద్ధులు, బీడీ కార్మికులు పెన్షన్లు సుమారుగా 1,63 వేలమంది లబ్ధిదారులు ఉన్నారు. కొన్ని గ్రామాలలో పైన వస్తున్న 16 రూపాయలు ఇవ్వడం లేదు. చిల్లర రూపాయిలు అడుగుతే చిల్లర లేవు మేము ఏం చేయాలని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్లు పోస్ట్ ఆఫీస్ అధికారులు అందించాలి. అయితే ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ అధికారులు పెన్షన్లు అందజేస్తున్నారు. పైన వస్తున్న 16 రూపాయలు మాత్రం ఇవ్వడం లేదు.16 రూపాయల అడుగుతే చిల్లర లేవు, అని పొంతనలేని సమాధానాలు చెపుతున్నారు. వృద్ధులకు 2016 బీడీ కార్మికులకు 2016 దివ్యంగులకు 3016 రూపాయలు, ప్రతి నెల ప్రభుత్వం పెన్షన్ ఈ రూపాయలలో పంపిణి చేస్తున్నది కానీ కొన్ని గ్రామాలలో బిపిఏం లు మీద వచ్చే 16.రూపాయలు ఇవ్వడం లేదు. దాదాపు కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామం లో ఇదే తంతు నడుస్తుంది. ఈ విధంగా లబ్ధిదారులకు ఇవ్వకుండా బి పి ఏం లు ఒక నెలకు వెల్లల్లో రూపాయలను సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నారు వృద్దుడు కానీ దివ్యంగుడు పోస్ట్ ఆఫీస్ రాలేని పరిస్థితి.ఇలా ఒక నెల లో ఒక్క.బిపి ఏం ఒక్క నెలలో వేల రూపాయలను లబ్ధిదారుల దగ్గర దోచుకుంటున్నారు.

బ్యాంక్ అకౌంట్ లో వేస్తేనే ఇబ్బంది ఉండదు

జిల్లాలో వచ్చే పెన్షన్ లబ్ధిదారుల అకౌంట్లో వేస్తేనే ఎలాంటి ఇబ్బంది ఉండదని లబ్ధిదారులు, ప్రతినెల పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్లి గంటలు గంటలు నిలబడడం కన్నా అకౌంట్లో వేస్తే అవసరం ఉన్నప్పుడు బ్యాంకుకు వెళ్లి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు, కావున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి లబ్ధిదారులకు పెన్షన్లను బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలని కోరుకుంటున్నారు.

Next Story