- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి 15 రోజుల జైలు శిక్ష.. రూ. 5వేల జరిమానా
మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో నిందితుడికి 15 రోజుల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానాను కోర్టు విధించింది.

దిశ, బాన్సువాడ : మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో నిందితుడికి 15 రోజుల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానాను కోర్టు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడలోని సంగేశ్వర కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా అతని మద్యం స్థాయి రీడింగ్‌లు 323 మి.గ్రా, 179 మి.గ్రా గా నమోదయ్యాయి. నిర్దేశిత పరిమితిని మించి మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలడంతో కేసును కోర్టుకు పంపించారు. బుధవారం ఈ కేసును విచారించిన రెండవ తరగతి మేజిస్ట్రేట్ టి. గోపాల్ నిందితుడికి 15 రోజుల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు శిక్ష విధించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుల్ సుధీర్ పాల్గొన్నారు.






