ఆర్మూర్ లో 14 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

by Disha Web Desk 1 |
ఆర్మూర్ లో 14 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ మామిడిపల్లిలో విగ్రహ దాతగా డిచ్ పల్లి దినేష్ వ్యవహరించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14 అడుగుల భారీ విగ్రహాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ లింబాద్రి, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.సరిత ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోచన్న, మధు శేఖర్, అశోక్, పండిత్ వినితా పవన్, మెట్టు సంతోష్, పస్కా నరసయ్య , మైలారం బాలు, మేడిదాల రవి గౌడ్, ఆకుల రాము, కొనపర్తి కాశీరాం, వడ్లురి రాజగంగారం, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed