నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1200 క్యూసెక్కుల నీరు విడుదల

by Chintha Aamani |   (  Updated:2025-06-18 15:06:57  IST  )

నిజామాబాద్, బోధన్ పట్టణాలకు తాగునీటి అవసరాల నిమిత్తం

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1200 క్యూసెక్కుల నీరు విడుదల
X

దిశ,నిజాంసాగర్ : నిజామాబాద్, బోధన్ పట్టణాలకు తాగునీటి అవసరాల నిమిత్తం బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేపట్టినట్లు నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. నీటిని విడుదల నేపథ్యంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిసరాల్లో ప్రజలు ఎవరూ కూడా కాలువలోకి దిగరాదని, పశువులు, గొర్రెలను కూడా కాల్వలోకి దించరాదని, నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిసర ప్రాంత ప్రజలు కాల్వలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ప్రధాన కాలువ తూములు తెరవడం నిషిద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున నీటిని వృధా చేయకుండా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. ప్రాజెక్టు పూర్తి సాయి నీటి మట్టం 1405.00 అడుగులు, 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1393.78 అడుగుల 6.032టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story