Student Collapse with Heart Stroke : సంతోషంగా టాటా చెప్పి.. అంతలోనే కుప్పకూలిన స్కూల్ విద్యార్థి

by Muthe.Rajitha |

ఈ మధ్య కాలంలో గుండెపోటు(Heart Stroke) మరణాలు అందరినీ కలవర పెడుతున్నాయి.

Student Collapse with Heart Stroke : సంతోషంగా టాటా చెప్పి.. అంతలోనే కుప్పకూలిన స్కూల్ విద్యార్థి
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో గుండెపోటు(Heart Stroke) మరణాలు అందరినీ కలవర పెడుతున్నాయి. గుండెపోటు వయసు మళ్లిన వాళ్ళకు, అధిక కొలెస్ట్రాల్ వస్తుంది అనుకుంటే పొరపాటే. 15 ఏళ్లు నిండని, ఆడే పాడే పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్స్ రావడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. తాజాగా తెలంగాణలో ఓ 10th క్లాస్ విద్యార్థిని(10th Student) స్కూల్ కు వెళుతూ గుండెపోటుతో కుప్పకూలి మరణించింది. ఈ విషాద ఘటన శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేసుకుంది. ప్రస్తుత కామారెడ్డి జిల్లా(Kamareddy District)లోని సింగరాయిపల్లికి చెందిన 10th క్లాస్ స్టూడెంట్ శ్రీనిధి.. కామారెడ్డి పట్టణంలో తన పెదనాన్న ఇంట్లో ఉండి చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే ఇంట్లో వాళ్ళకి సంతోషంగా టాటా చెప్పి స్కూల్ కి బయలుదేరింది. అయితే స్కూల్ వరకు నడుచుకుంటూ వచ్చిన శ్రీనిధి.. అక్కడికి చేరగానే ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. తక్షణమే స్పందించిన టీచర్లు సీపీఆర్ అందించినా ఫలితం లేకుండా పోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే విద్యార్థిని మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఇటు సింగరాయపల్లిలో అటు శ్రీనిధి పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Next Story