- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణాలకు తెగించి.. వాగు దాటించిన 108 సిబ్బంది..!
దిశ, తాడ్వాయి : ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగులు పొంగి ప్రవహించాయి. నిండు గర్భీణీకి పురిటి నొప్పులు రావడంతో ఓ గ్రామంలో తీవ్ర ఆందోళన

దిశ, తాడ్వాయి : ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగులు పొంగి ప్రవహించాయి. నిండు గర్భీణీకి పురిటి నొప్పులు రావడంతో ఓ గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించి ఆ గర్భిణీని ఆసుపత్రిని తరలించిన 108 అంబులెన్స్ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. లింగంపేట మండలం మోతే భట్టిప్ప తండాకు చెందిన నిండు గర్భిణీ సరస్వతికి ఆదివారం అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ గ్రామానికి ప్రదాన రహదారికి మధ్య ఉన్న వాగు ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహించింది. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించడం కుటుంబ సభ్యులకు కష్టంగా మారింది.
క్లిష్ట పరిస్థితుల్లో 108 సేవలు
వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వాగు ఉధృతిని గమనించిన 108 పైలెట్ ప్రశాంత్, ఈఎంటీ అక్షర వెంటనే గ్రామానికి సమీపంలోని వాగు ఒడ్డు వరకు చేరుకున్నారు.వాగు దాటడానికి అంబులెన్స్ ద్వారా అవకాశం లేకపోవడంతో వారు స్థానికుల సహాయం కోరారు. స్థానికులు, 108 సిబ్బంది కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో జాగ్రత్తగా ముందుకు కదిలారు.స్థానికుల సహాయంతో నిండు గర్భిణీ సరస్వతిని ఎంతో కష్టం మీద వాగు దాటించారు.వాగు అవతలి ఒడ్డుకు చేరుకోగానే సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్‌లో ఆమెను సురక్షితంగా ఎక్కించి,కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.దింతో సరస్వతి కుటుంబ సభ్యులు,సకాలంలో స్పందించి తమ బిడ్డను ఆసుపత్రికి చేర్చిన 108 పైలెట్ ప్రశాంత్, ఈఎంటీ అక్షరకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంఘటన క్లిష్ట సమయాల్లోనూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో 108 సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేదానికి నిదర్శనంగా నిలిచింది.






