- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పడకేసిన '108' వాహనం
దిశ, కమ్మర్ పల్లి : రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర సమయంలో ప్రజలను కాపాడుతున్న 108 వాహనాలు తిరిగి తిరిగి ప్రస్తుతం అవే మూలన పడ్డాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో 8 మండలాలకు గాను

దిశ, కమ్మర్ పల్లి : రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర సమయంలో ప్రజలను కాపాడుతున్న 108 వాహనాలు తిరిగి తిరిగి ప్రస్తుతం అవే మూలన పడ్డాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో 8 మండలాలకు ప్రస్తుతం 108 వాహనాలు 4 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మూడు వాహనాలు మరమ్మతుకు నోచుకోక తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని ఎంత రిపేర్ చేసినా తిరిగి నెల రోజుల్లోనే మళ్లీ సమస్య ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు పేషెంట్ వాహనంలో ఉండగానే సమస్య వచ్చి ముందుకు పోయే పరిస్థితి లేదు. ఆర్మూర్-జగిత్యాల జాతీయ రహదారి ఆనుకొని ఉన్న కమ్మర్ పల్లి మండలంలో అత్యవసర సేవల కోసం వినియోగించుకునే 108 వాహనం కరవైంది. 10 రోజుల క్రితం నుండి మురాయించి మూలన పడింది. మండల కేంద్రంలో అందుబాటులో లేకపోవటంతో ఆపద వస్తే సేవల కోసం ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని, కమ్మర్ పల్లి మండలంలో జాతీయ రహదారిపై చోటుచేసుకొన్న రోడ్డు ప్రమాద బాధితులతో పాటు గ్రామాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కోతులు, కుక్కలు, పాముకాటుకు గురైన బాధితులు, గర్భిణుల సేవలు ఆస్పత్రిలో పొందేలా 108 వాహనంలో తీసుకెళ్తుంటారు. మండల కేంద్రంతో పాటు సమీప మండలాలకు ఈ వాహనంలో తరలించి సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వాహనం అందుబాటులో బాధితులు అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద ఘటనలు జరిగితే పరిస్థితి ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంబులెన్స్ వాహనం సమకూర్చి సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.






