బీఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు

by velandi.Saikiran |

బాన్సువాడ పట్టణంలోని ఎస్.ఎం.బి. ఫంక్షన్ హాల్ లో మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కాంగ్రెస

బీఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు
X

దిశ, బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ఎస్.ఎం.బి. ఫంక్షన్ హాల్ లో మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆహ్వానించారు.చేరిన వారిలో కోటగిరి మాజీ ఏం.పి.పి. శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యల మంచిలి శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పార్టీ పటిష్టం కొరకు కలిసి కట్టుగా పని చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు కొరకు పాటు పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్,గణేష్,రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story