- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైన్స్ షాపులకు దేవుని పేర్లు తీసేయాలి – బీజేపీ ఎమ్మెల్యే
వైన్స్ షాపులకు దేవుని పేర్లు తీసేయాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు.

*వైన్స్ షాపులకు దేవుని పేర్లు తీసేయాలి*
*దేవుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలి*
*అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్*
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు దేవుని పేర్లు తీసేయాలని డిమాండ్ చేశారు. ఇకపైన మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. దేవుళ్ళ పేర్లు పెట్టి హిందూ మతాన్ని అవమానిస్తున్నారని, దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఇకపైన లైసెన్సులు ఇచ్చేటప్పుడే దేవుని పేర్లు మద్యం దుకాణాలకు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా.
ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే ఈ మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రేణుక ఎల్లమ్మ, మైసమ్మ తల్లి అంటూ రకరకాల హిందూ దేవతల పేర్లు పెట్టుకుని మద్యం దుకాణాలు నడిపిస్తున్నారు. హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టుకుని మద్యం దుకాణాలను నడిపిస్తే మంచి గిరాకీ వస్తుందని జనాల నమ్మకం. అందుకే ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇకపైన మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు పెట్టకూడదని బీజేపీ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది.






