- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dharmapuri Arvind: ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ ఏం చేస్తోంది: ఎంపీ అర్వింద్
హిందువులంటేనే నిబంధనలు గుర్తుకొస్తయా? అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం కోసం పోలీసులపై ఒత్తిడి తెస్తోందని గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఒకే రకంగా ప్రవర్తిస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. హిందువులన్నా, హిందూ పండగలన్నా చులకన భావంతో చూస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ నిజామాబాద్ కమిషనరేట్ లో సీపీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల నవీపేటలో ఓ యువకుడు గణపతిపై కాషాయ జెండా ఎగురవేస్తే ఫోటోలో అది మసీదుపై పెట్టినట్లు వచ్చిందని దాంతో ఆ యువకుడిని ఆగమేఘాల మీద అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారన్నారు. ఈ ఘటన తర్వాత అక్కడ ముస్లింలు బైక్ ర్యాలీ నిర్వహించి రబసా చేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేని మేము డిమాండ్ చేశాక చర్యలు తీసుకున్నారని చెప్పారు. జెండా ఎగురవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు రాజస్థాన్ కు చెందిన వాడని అతడిని రాజస్థాన్ పంపాలని అంటున్నారు. మరి దేశంలోకి వచ్చిన బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఎందరో అక్రమంగా ప్రవేశించారు. టర్కీ నుంచి వచ్చి తరతరాలుగా ఇక్కడే ఉంటున్న కూడా వెనక్కి పంపిద్దామా కాంగ్రెస్ చెప్పాలన్నారు.
తప్పు చేసిన వారిని అరెస్టు చేయాలి తప్ప మతం ఆధారంగా చర్యలు తీసుకుంటే సమాజంలో విభజన వస్తుందని హెచ్చరించారు. జిల్లాల్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగాయని, బోధన్ పీఎఫ్ఐ, సిమికి అడ్డగా మారాయని వీటి వల్ల ప్రజలు భయాందోళనలో ఉన్నారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఆరోపించారు. ఎన్జీవోల పేరుతో హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా సహాయం చేస్తామని అంటున్నారని ఇది లవ్ జిహాద్ అంటారన్నారు. ఈ పరిస్థితికి వస్తే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.






