- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nizam College: ప్రిన్సిపాల్ తీరుకు నిరసనగా నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన
by Prasad Jukanti |
ప్రిన్సిపాల్ తీరుకు నిరసనగా నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనకు దిగారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల (Nizam College) ఎదుట విద్యార్థులు ఆందోళనకు (Students Agitation) దిగారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు హాజరయ్యేందుకు వచ్చిన తమను ఉదయం 9 గంటల వరకు లోపలికి అనుమతించకుండా ప్రిన్సిపాల్ ఆదేశాలు ఇచ్చారని రోడ్డుపై బైఠాయించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను కనీసం కాలేజీ లోపలకి అనుమతించకుండా గేట్లు మూయించి ప్రిన్సిపాల్ అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొండివైఖరి మానుకోవాలని ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆందోళనకారులకు సముదాయించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Next Story






