నిజాం కాలేజీలో ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన విద్యార్థినులు

by Ajay Maddhiboyina |

నిజాం కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను హాస్టల్‌కు రావాలని పిలిచిన యాజమాన్యం ఫెసిలిటీ కల్పించలేదు.

నిజాం కాలేజీలో ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన విద్యార్థినులు
X

దిశ‌, వెబ్ డెస్క్: నిజాం కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను హాస్టల్‌కు రావాలని పిలిచిన యాజమాన్యం ఫెసిలిటీ కల్పించలేదు. దీంతో విద్యార్థినులు ధర్నాకు దిగారు. లగేజీ తీసుకుని వచ్చిన విద్యార్థినులను హాస్టల్‌లోకి అనుమతించకపోగా కనీసం ఫుడ్ కూడా పెట్టలేదు. కొద్దిరోజులు సమయం కావాలని ఆ తరవాతనే హాస్టల్‌లోకి అనుమితిస్తామని వార్డెన్ చెప్పడంతో విద్యార్థినులు హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. సాయంత్రం వర్షంలో ధర్నాకు దిగిన విద్యార్థులు రాత్రైనా ధర్నా కొనసాగించారు. చీకటిపడటంతో సెల్ ఫోన్ లైట్స్ ఆన్ చేసుకుని నినాదాలు చేశారు. డీడీ కట్టించుకున్న విద్యార్థులను వెంటనే హాస్టల్‌లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. అసమర్థ ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story