- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ భారీ విరాళం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని బల్కంపేట ఎలమ్మ తల్లి ఆలయానికి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం అందజేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని బల్కంపేట ఎలమ్మ తల్లి ఆలయానికి (Balkampet Yellamma Temple) ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani ) భారీ విరాళం అందజేశారు. అమ్మవారి ఆలయం, నిత్య అన్నదానం కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆమె బ్యాంకులో దేవస్థానం అకౌంట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారని, దీనిపై వచ్చిన వడ్డీతో భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మహేందర్ గౌడ్ ఈ సందర్భంగా వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 23న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరైన నీతా అంబానీ.. ఆ సమయంలో తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధికి సహకరించాలని ఆలయ ఈవో కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఇంతటి భారీ విరాళాన్ని అందించిన నీతా అంబానీ కుటుంబసభ్యులకు ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. నీతా అంబానీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా ఎల్లమ్మను దర్శించుకుని వెళ్తుంటారు.






