- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లు వేసినం.. ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగ మహాగర్జన
సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లు వేసినమని (Unemployed) నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కదం తొక్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లు వేసినమని (Unemployed) నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. ఇవాళ (Indira Park) ఇందిరాపార్కు ధర్నా చౌక్ (Dharna Chowk) వద్ద 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగ మహాగర్జన (Nirudyoga Mahagarjana) నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మహాగర్జనకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఈ సందర్భంగా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని రోడ్లపైకి తెచ్చిన రేవంత్ రెడ్డికి, జీవితంలో ఇంకోసారి ఓట్లు వేయమని ఓ నిరుద్యోగ మహిళ మీడియాతో మాట్లాడారు. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని, మా నిరుద్యోగ యువత ఓట్లు వేస్తేనే నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. మేము ఓటు వేసినందుకైనా మాకు న్యాయం చేయండని ఓ నిరుద్యోగ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.






