- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్థిక పరిస్థితి(Telangana's Economic Situation)పై రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక పరిస్థితి(Telangana's Economic Situation)పై రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని గుర్తు చేశారు. విభజన తర్వాత తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని అన్నారు. తాను ఏ పార్టీనీ తప్పుపట్టడం లేదు.. ఇందిరా గాంధీ గెలిచిన మెదక్‌లో తొలుత రైల్వే స్టేషన్ మోడీ ఏర్పాటు చేశారు. రామగుండం ఎరువు ఫ్యాక్టరీని పునరుద్ధరించామని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు.
మరోవైపు.. కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కానీ మోజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మానాన్ని ఆమోదించారు. హౌజ్ సెలెక్ట్ కమిటీకి ఆదాయ పన్ను ముసాయిదా తీర్మానాన్ని రిఫర్ చేయాలని మంత్రి సీతారామన్ కోరారు. అయితే వచ్చే సెషన్ తొలి రోజున ఆ సెలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై తమ నివేదికను ఇవ్వనున్నది. చాలా సరళమైన రీతిలో పన్ను బిల్లు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.






