- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: నిప్పులాంటి నిజం.. అప్పు తీర్చడంలో మహిళలే నంబర్ వన్
రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు రుణాలు తిరిగి చెల్లించడంలో ముందున్నారు. దేశంలో ఏ రంగంలో బ్యాంకు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించినా.. వారిలో మహిళా సంఘాలే ముందున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు రుణాలు తిరిగి చెల్లించడంలో ముందున్నారు. దేశంలో ఏ రంగంలో బ్యాంకు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించినా.. వారిలో మహిళా సంఘాలే ముందున్నాయి. వివిధ రంగాల్లో తీసుకున్న రుణాల్లో అతి తక్కువగా ఎన్‌పీఏగా ఎస్‌హెచ్‌జీ మహిళలే ఉన్నారు. తెలంగాణలోని నిర్మల్‌జిల్లా ఏకంగా జీరో ఎన్‌పీఏగా నిలిచింది. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో లక్ష కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రుణాలు తిరిగి చెల్లించే రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళా సంఘాలకు మరింత లబ్ధిచేకూరనుంది. రాష్ట్రంలో 4.46లక్షల సంఘాల్లో 45.20 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.
ఉత్సాహంగా చెల్లింపు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 8.88 శాతం ఎన్‌పీఏ ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయని గుర్తించారు. ఎన్‌పీఏను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు మహిళల్లో చైతన్యం తీసుకరావడం, రుణం తిరిగి చెల్లించడానికి వారిలో అవగాహన పెంచడంతో రుణాల తిరిగి చెల్లింపు ఉత్సాహంగా సాగుతుంది. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరం ఎన్‌పీఏ కేవలం 1.40 శాతం మాత్రమే ఉందని తేలింది. తీసుకున్న రుణాన్ని మహిళలు 61 శాతం వ్యవసాయ, అనుబంధ రంగాలపై పెట్టుబడి పెడుతున్నారని గుర్తించారు. 30 శాతం వ్యవసాయం రంగంపై, 31 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలపై, 10 శాతం చిన్న వ్యాపారాలు, 8 శాతం సర్వీసు సెక్టార్‌పై, 20 శాతం వస్తువులు కొనడానికి, వ్యక్తిగత, ఇంటి అవసరాలకు వాడుకున్నట్టుగా గుర్తించారు.
కుటుంబాలకు భరోసా..
మహిళలు ఏదైనా కారణంతో మరణిస్తే రూ.2లక్షల వరకు లోన్బీమాను అందిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 2993 మంది రూ.23.72 కోట్ల లబ్ధిపొందారు. ఏదైనా కారణంతో మరణిస్తే ఆమె బ్యాంకుకు రుణం రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని దీని ద్వారా అందిస్తారు. దీంతో ఆమె చనిపోయినా ఆ కుటుంబానికి ఆర్థిక భారం కాకుండా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇప్పటికీ 2993 లబ్ది పొందినట్టు గుర్తించారు. మహిళ ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రమాద బీమాను రూ.10లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. ఇలా ఇప్పటి వరకు 229 మంది ప్రమాదవశాత్తు చనిపోవడంతో రూ.22.29 కోట్లను అందించారు. ఈ మొత్తంలో ఆమె బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం పోగా మిగిలిన మొత్తాన్ని ఆ కుటుంబానికి అందిస్తారు. దీంతో మహిళలు చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక భారం కాకుండా అండగా నిలుస్తున్నారు.






