- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : నిరంజన్ రెడ్డి రాజకీయాలను కలుషితం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వనపర్తి(Wanaparthy) పర్యటన కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వనపర్తి(Wanaparthy) పర్యటన కొనసాగుతోంది. నేడు వనపర్తిలో ప్రజా పాలన ప్రోగ్రాంలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి అంటే తనకు ఎనలేని గౌరవం అన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన వనపర్తికి, తెలంగాణకు కీర్తి తెచ్చేలా పని చేస్తానని తెలిపారు. గతంలో వనపర్తి రాజకీయాల్లో ధనప్రభావం లేదని, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి(BRS Former MLA Niranjan Reddy) ఇక్కడి రాజకీయాలను కలుషితం చేశారని మండిపడ్డారు. వనపర్తి రైతులకు రూ.7 వేల కోట్ల రైతు రుణామాఫీ మంజూరు చేశామని.. కావాలంటే స్వయంగా బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చని విపక్షాలకు సవాల్ విసిరారు. నియోజక వర్గంలోని ప్రజలకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఆడబిడ్డలకు రూ.500 కే ఉచిత సిలిండర్ అందిస్తున్నామని వెల్లడించారు.
మహిళలు ఎక్కడికి వెళ్లాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని.. మహిళలకు ఆర్థిక భరోసా అందించేందుకు కాంగ్రెస్ ఎన్నో పథకాలు చేపడుతున్నామని.. బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) పార్టీ నాయకులకు ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా సంఘాలకు రూ.1000 వెయ్యి కోట్లు వడ్డీ రహిత రుణాలు అందిస్తున్నామని.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ధ్యేయం అన్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత విలువైన స్థలాల్లో మహిళలకు భూములిచ్చి, అక్కడ వారు తయారు చేసిన వస్తువులు అమ్ముకునేందుకు 150 స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్ల వ్యాపారం అదానీ, అంబానీ కంపెనీలకు ఇవ్వకుండా రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు అందించిన ఘనత తమదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






