Maoists Surrender : తొమ్మిది మంది మావోయిస్టుల లొంగుబాటు!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-30 10:37:44  IST  )

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)రాష్ట్ర సుక్మా జిల్లా(Sukma District)లో తొమ్మిది మంది మావోయిస్టు(Nine Maoists Surrender) లు ప్రభుత్వానికి లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ (SP Kiran Chauhan)మీడియా సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులను హాజరుపరిచి వివరాలు వెల్లడించారు.

Maoists Surrender : తొమ్మిది మంది మావోయిస్టుల లొంగుబాటు!
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)రాష్ట్ర సుక్మా జిల్లా(Sukma District)లో తొమ్మిది మంది మావోయిస్టు(Nine Maoists Surrender) లు ప్రభుత్వానికి లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ (SP Kiran Chauhan)మీడియా సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులను హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం "నియాద్ నెల్ల నార్" పథకం ప్రభావంతో మారుమూల అటవీ ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం..విస్త్రత కూంబింగ్ ఆపరేషన్లతో మావోయిస్టలు లొంగిపోవడం జరుగుతుందని తెలిపారు.

సుక్మా ప్రాంతంలోని పీఎల్ జీఏ(PLGA)బెటాలియన్ లో క్రియాశీలంగా ఉన్న ఇద్దరు నక్సలైట్ జంటలతో సహా మొత్తం 9 మంది హార్డ్‌కోర్ నక్సలైట్లు లొంగిపోయారని వివరించారు. లొంగిపోయిన నక్సలైట్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ.52 లక్షల రివార్డు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. లొంగిపోయిన ఇద్దరు పురుషులు, నలుగురు మహిళా నక్సలైట్లపై ఒక్కొక్కరికి రూ.8 లక్షలు, ఒక మహిళా మావోయిస్టు పై 2 లక్షలు, ఇద్దరు మహిళా నక్సలైట్లపై ఒక్కొక్కరికి లక్ష చొప్పున ప్రభుత్వం రివార్డు ప్రకటించగా ఆ రివార్డు మొత్తాన్ని వారికి అందజేసినట్లుగా తెలిపారు.

సుక్మా జిల్లా సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు డీఆర్జీ(DRG), నక్సల్ సెల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ టీమ్, పోలీస్ స్టేషన్ చింతగుఫా, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సుక్మా 2 కార్ప్స్ సీఆర్పీఎఫ్(CRPF), 204 కోబ్రా కార్ప్స్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ భద్రతా సిబ్బంది ఈ నక్సలైట్లను లొంగిపోయేలా ప్రోత్సహించడంలో ప్రత్యేక పాత్ర పోషించారని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో సమర్ధవంతంగా జీవించేందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల స్ఫూర్తితో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సైతం ఆయుధాలను వీడి హింసకు స్వస్తి పలికి జన జీవన స్రవంతిలోకి రావాలని ఎస్సీ కిరణ్ చౌహాన్ కోరారు.

చత్తీస్‌ గడ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఇప్పటికే 250మందికి పైగా మావోయిస్టులు మ‌ృతి చెందగా..వందలాది మంది లొంగిపోయారు. మావోయిస్టులకు గట్టి పట్టున్న చత్తీస్ గడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్ధుల్లోని అడవుల్లో మావోయిస్టుల కోసం కేంద్ర రాష్ట్రాల భద్రతా బలగాలు ఉమ్మడి ఆపరేషన్లతో అడవులను జల్లెడ పడుతున్నాయి.

చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఏడు జిల్లాలని కలుపుతూ ఉన్న ప్రాంతం మావోయిస్టులకి పెట్టని కోట వంటిది. చుట్టూ సెలయేర్లు పెద్దపెద్ద గుట్టలు దట్టమైన కాకులు దూరని కారడవితో కూడిన కీకారారణ్యం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని అబూజ్ మడ్(ABOOJMAD) అటవీ ప్రాంతం. మావోయిస్టులకి ఈ అటవీ ప్రాంతం పరిధిలోని సుక్మా, దంతేవాడ, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాల ప్రాంతాల్లో అబుజ్ మడ్ కొంత భాగం ఉంటే , మరి కొంత భాగం ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉంది. మావోయిస్టుకు కీలకమైన స్థావరంగా ఉన్న అబుజ్ మడ్, దండకారణ్యం ప్రాంతంలోనే దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని పాత తరం మావోయిస్టు నాయకత్వం కూడా ఇదే ప్రాంతంలోని ఉంది.

మావోయిస్టులకు కీలకమైన చత్తీస్ గడ్ అబూజ్ మడ్ ప్రాంతం నేడు భద్రతా బలగాల వశం అవుతుంది. ఇటీవల కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భద్రతా బలగాలే మావోయిస్టులపై పైచేయి సాధిస్తుండటంతో మావోయిస్టు పార్టీ భారీ నష్టాలను చవిచూస్తుంది. ఈ నేపథ్యంలో గెరిల్లా యుద్ధనీతిలో భాగంగా మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలైన సమీప రాష్ట్రాలకు వలస వెలుతున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. తాజాగా మూడేళ్ల తర్వాత మొదటిసారిగా ఇటీవల ఏపీలోకి 30 మంది మావోయిస్టులు చత్తీస్ గడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు ఎంటర్ అయినట్లు స్వయంగా ఆ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించడం విశేషం. ఏపీ లోకి వచ్చిన 30 మందిలో 13 మంది పార్టీని వదిలి వెళ్ళిపోయారనీ చెప్పారు. మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

Next Story