- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాకెందుకు లే అని వదిలేయలేదు.. బాధ్యతగా ఓ నిండు జీవితాన్ని కాపాడిండు’
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఓపీడీ 32వ రూమ్‌లో పనిచేసే కార్మికుడు శ్రీనివాస్ సీపీఆర్ ద్వారా రోగి ప్రాణాలను కాపాడాడు.

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఓపీడీ 32వ రూమ్‌లో పనిచేసే కార్మికుడు శ్రీనివాస్ సీపీఆర్ ద్వారా రోగి ప్రాణాలను కాపాడాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం పెద్ద నక్కలపేట్ గ్రామానికి చెందిన బగ్గీ అశోక్ తన భార్య లక్ష్మితో కలిసి బుధవారం జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్య పరీక్షల కోసం ఓపీడీ విభాగానికి వచ్చారు. అకస్మాత్తుగా అశోక్ గుండెనొప్పితో కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్న శ్రీనివాస్ వైద్యుల కోసం ఎదురు చూడకుండా సీపీఆర్ చేసి ట్రాలీలో ఏఎంసీ వార్డ్‌కు తీసుకెళ్లి అడ్మిట్ చేసి అశోక్ ప్రాణాలు కాపాడాడు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి రోగి ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్‌ను డైరెక్టర్ నగరి భీరప్ప ప్రత్యేకంగా అభినందించారు. రోగి అశోక్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది కోలుకుంటున్నాడు అని వైద్యులు తెలిపారు. అశోక్ భార్య లక్ష్మి, వారి బంధువులు మరియు తోటి ఉద్యోగులు శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






