- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NIMS: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర..! జీవో 230 జారీపై నిమ్స్ ఉద్యోగుల హర్షం
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఉద్యోగుల చిరకాల స్వప్నమైన ‘ఆర్జిత సెలవుల నగదు మార్పిడి’కి ప్రభుత్వం పచ్చజెండా ఊపడం పట్ల నిమ్స్ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఉద్యోగుల చిరకాల స్వప్నమైన ‘ఆర్జిత సెలవుల నగదు మార్పిడి (Earned Leaves Encashment)’కి ప్రభుత్వం పచ్చజెండా ఊపడం పట్ల నిమ్స్ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ విజ్ఞప్తిని మన్నించి, ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని ఈరోజు (మంగళవారం) నిమ్స్ ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్ లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందించి, ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎయిమ్స్ పే స్కేల్స్ పొందుతున్న నిమ్స్ రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు. ఇటీవల హాస్పిటల్ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ ఆవేదనను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ, అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి చొరవతో ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నం. 230) జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న 'తెలంగాణ లీవ్ రూల్స్-1933' నిబంధనల ప్రకారమే, ఇకపై నిమ్స్ ఉద్యోగులు కూడా తమ ఆర్జిత సెలవులను సరెండర్ చేసి నగదు పొందవచ్చునని జీవోలో పేర్కొన్నారు.
మంత్రిని కలిసిన సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తమ కష్టాన్ని గుర్తించి, ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించినందుకు మంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది నిమ్స్ ఉద్యోగులకు ఆర్థికంగా లబ్ది చేకూరనుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పేషెంట్ల పట్ల చిర్రుబుర్రులు ఆడొద్దని, సహనంతో సానుభూతితో వ్యవహరించాలన్నారు.






