- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఫలించిన ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
TG: ఫలించిన ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

దిశ, వెబ్‌డెస్క్: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఉద్యోగుల ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. వారు కోరుతున్నట్టుగా ‘ఆర్జిత సెలవుల నగదు మార్పిడి (Earned Leaves Encashment)’కి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక చొరవ తీసుకోవడంతో, నిమ్స్ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నం. 230) జారీ చేసింది. ఎయిమ్స్ పే స్కేల్స్ పొందుతున్న నిమ్స్ రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటివరకు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాయి. ఇటీవల హాస్పిటల్ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి తమ సమస్యను విన్నవించారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా, అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న 'తెలంగాణ లీవ్ రూల్స్-1933' నిబంధనల ప్రకారమే, ఇకపై నిమ్స్ ఉద్యోగులు కూడా తమ ఆర్జిత సెలవులను సరెండర్ చేసి నగదు పొందవచ్చు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు సోమవారం జీవో విడుదల చేశారు.
ఉద్యోగుల హర్షం:
తమ కష్టాన్ని గుర్తించి, చిరకాల వాంఛను నెరవేర్చినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహాకి నిమ్స్ ఉద్యోగ వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుందని వారు హర్షం వ్యక్తం చేశారు.






