ఆ ప్రచారం నమ్మొద్దు.. నిమ్స్‌లో కిడ్నీ దందాపై డైరెక్టర్ క్లారిటీ

by Prasad Jukanti |

నిమ్స్‌లో కిడ్నీ దందా జరుగుతోందన్న ప్రచారాన్ని డైరెక్టర్ బీరప్ప ఖండించారు. ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని తొలగించామన్నారు.

ఆ ప్రచారం నమ్మొద్దు.. నిమ్స్‌లో కిడ్నీ దందాపై  డైరెక్టర్ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నిమ్స్‌ (Nizams Institute of Medical Sciences)లో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లక్షల మంది పేషెంట్లకు సేవలు అందిస్తున్న ఆసుపత్రిపై బురదజల్లే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కిడ్నీ ఆపరేషన్ చేయిస్తానని చెప్పి నిమ్స్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఒకరు డబ్బులు తీసుకున్నట్టు ఒక పేషెంట్ నుంచి ఫిర్యాదు వచ్చిందని ఈ అంశంపై పంజాగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించామని ఈ అంశంలో ఇంకెవరి పాత్ర ఉన్నట్టు తేలితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని చిలువలు, పలువలు చేసి నిమ్స్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని బీరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని ఇలాంటి వారు సృష్టించే అపోహలు, దురుద్దేశపూరిత ప్రచారం పట్ల మీడియా అప్రత్తంగా ఉండాలని బీరప్ప విజ్ఞప్తి చేశారు.

ప్రతిష్టాత్మక సంస్థలో..

కాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల బలహీనతలను వారి కుటుంబాల ఆవేదనను ఆసరాగా చేసుకుని నిమ్స్ లో కొందరు కేటుగాళ్లు దందాలకు తెగబడుతున్నారని కిడ్నీ మార్పిడి చేయిస్తామంటూ రోగుల నుండి లక్షలాది రూపాయలు గుంజుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాకం తాగా వెలుగు చూసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నిమ్స్ డైరెక్టర్ ఖండించారు. నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ప్రచారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Next Story