- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఖత్ జరీన్ క్రీడాకారులకు ఆదర్శం.. డీజీపీ శివధర్‌రెడ్డి ప్రశంసలు
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) గోల్డ్ మెడల్ సాధించడం పట్ల డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) గోల్డ్ మెడల్ సాధించడం పట్ల డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల 51 కేజీల ఫైనల్ పోటీలో ఆమె తన ప్రత్యర్థిపై 5-0 తేడాతో ఘన విజయం సాధించడం ఆమె సామర్థ్యానికి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. గోల్డ్ మెడల్ సాధించి, తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిన నిఖత్ జరీన్‌ను అభినందిస్తున్నానని అన్నారు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ ఫ్యామిలీ తరఫున నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి ఆకాంక్షించారు.






