- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CPI ML ఖమ్మం జిల్లా ఆఫీస్‌లో NIA అధికారులు
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్/ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును విచారించేందుకు అధికారులు నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని సీపీఐ (ఎంఎల్) పార్టీ కార్యాలయంలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టడంతో పాటు పోటు రంగారావును విచారిస్తున్నారు. గతంలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారంటూ ఎన్‌ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు. ఈనెల 2వ తేదీనే (ఏప్రిల్ 2, 2026) విచారణకు హాజరు కావాలని అధికారులు పోటు రంగారావుకు నోటీసులు జారీ చేశారు. అయితే.. నోటీసులపై స్పందించిన పోటు రంగారావు, ఏప్రిల్ 22వ తేదీన తాను ఖమ్మంలో అందుబాటులో ఉంటానని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు నేడు అధికారులు నేరుగా ఖమ్మం వచ్చి విచారణ చేపడుతున్నారు.
నాయకుల ఖండన..
ప్రజా సమస్యలపై గళమెత్తే నాయకులను కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏ పేరుతో వేధిస్తోందని సీపీఐ (ఎంఎల్) నాయకులు మండిపడుతున్నారు. తప్పుడు కేసులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు విమర్శిస్తున్నారు. పోటు రంగారావు విచారణ నేపథ్యంలో ఖమ్మం రాజకీయ వర్గాల్లో మరియు వామపక్ష శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.






