- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీవీ ఇన్‍ఫుట్ ఎడిటర్ అరెస్టుపై NHRC కేసు నమోదు
తనకు సంబంధం లేని వార్తతో లింక్ పెట్టి అరెస్టు చేశారని దొంతురమేశ్ సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ముగ్గురు ఎన్‌టీవీ రిపోర్టర్లు అరెస్ట్ ఘటన తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్‍పై వచ్చిన కథనం విషయంలో తెలంగాణ పోలీసులు NTV ఇన్‍ఫుట్ ఎడిటర్ దొంతు రమేశ్, మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‍ను రెండు రోజుల క్రితం సిట్ (SIT) అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దొంతు రమేశ్ అరెస్టు విషయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో (NHRC) కేసు నమోదు అయింది. రమేశ్‍ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మీడియా వ్యక్తులపై దౌర్జన్యం కింద ఎన్‍హెచ్ఆర్‍సీ కేసు నమోదు చేసింది.
సంబంధం లేని వార్తతో నాకు లింక్ పెట్టారు:
తన అరెస్టు విషయంలో దొంతు రమేశ్ (Donthu Ramesh) ఎక్స్ వేదికగా స్పందించారు. విచారణకు రాకుండా విదేశాలకు పారిపోతుండగా అరెస్టు చేశామని పోలీసులు చేసిన వాదనను ఖండించారు. సంబంధం లేని ఒక వార్తా కథనానికి, నాకు లింకు పెడుతూ నన్ను అరెస్టు చేశారన్నారు. దావోస్‍లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‍లో తెలంగాణా రాష్ట్ర భాగస్వామ్య వార్తల కవరేజీ కోసం అలాగే వెకేషన్ ట్రిప్ కోసం వయా బ్యాంకాక్ మీదుగా నా భార్యతో స్విట్జర్లాండ్‍కు వెళ్తున్న నన్ను, పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారని చెప్పారు. తనను అరెస్టు చేసి విచారణ పేరుతో నాకు ఏమాత్రం సంబంధం లేని అనేక ప్రశ్నలతో గంటల తరబడి వేధించారని ఆరోపించారు. పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించినప్పటి నుంచి నాకు బాసటగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పండగ పూట నేను చేయని తప్పుకు పాలకపక్షం పైశాచికానికి, అధికారగణం అణచివేతకు గురవుతున్న క్లిష సమయంలో తమ పంథాలు, సిద్ధాంతాలకు అతీతంగా స్పందించిన రాజకీయ పార్టీలు, మిత్రులు, జర్నలిస్టు సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.






