- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండలో గిరిజన యువకుడిపై దాడి.. పోలీసులపై చర్యలకు ఆదేశించిన NHRC
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే గిరిజన యువకుడిపై వాడేపల్లి పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే గిరిజన యువకుడిపై వాడేపల్లి పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. వాడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మరియు కానిస్టేబుల్స్ చట్ట వ్యతిరేకంగా సాయిని ఇంట్లో నుంచి లాకెళ్లి కులం పేరిట దూషిస్తూ, ఇష్టానుసారంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాదు.. సాయిపై అక్రమ కేసులు బనాయించారు. ఆ విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్తే మళ్లీ కొడతామని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మరియు కానిస్టేబుల్ బెదిరించారు. అదేవిధంగా బాధితుడి భార్య దీనాను కూడా దుర్భాషలాడారు. ఈ సంఘటనపై న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై నేడు విచారించిన జాతీయ మానవ హక్కుల సంఘం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ సంఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ చేపట్టి సంఘటనకు కారణమైన ఎస్ఐ మరియు కానిస్టేబుల్‌లను విధుల నుండి తొలగించి SC/ST atrocities చట్టం కింద కేసులు నమోదు నల్గొండ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా బాధితుడికి సరైన వైద్య సదుపాయం అందించి నష్టపరిహారం కూడా చెల్లించి పూర్తి నివేదిక 4 వారాల్లోపు కమిషన్ కు తెలపాలని జిల్లా ఎస్పీకి జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ట్వీట్






