- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి రద్దీకి చెక్.. హైదరాబాద్-విజయవాడ హైవేపై కొత్త ప్రయోగం
ప్రతీఏటా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఉంటోంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త టెక్నాలజీని ప్రయోగించనుంది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లేందుకు అందరూ షాపింగులు పూర్తి చేసి, బ్యాగులు సర్దుకుని రెడీ అవుతున్నారు. బస్సులు, రైళ్లు, సొంత వాహనాలు, క్యాబ్ లు ఇలా.. వివిధ రకాల ట్రాన్స్ పోర్టుల్లో సంక్రాంతికి ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రతీఏటా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఉంటోంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త టెక్నాలజీని ప్రయోగించనుంది. వాహనాలు ఆగకుండానే, మూడు సెకన్లలో టోల్ వసూలు చేసేలా శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ సిస్టమ్ ను పరిశీలిస్తోంది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ మేరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్లే 8 బూత్ లలో ఈ ట్రయల్ రన్ నిర్వహించగా.. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ను గుర్తించగానే సెన్సార్లు ఫాస్టాగ్ ను స్కాన్ చేసి ఆటోమెటిక్ గా పేమెంట్ ను కంప్లీట్ చేస్తాయి. అయితే కొన్ని వాహనాలకు టోల్ ఫీజు సరిగ్గా కట్ అవ్వకపోవడం వంటి సమస్యలను గుర్తించిన అధికారులు.. వాటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. పండుగ రద్దీ మొదలయ్యేలోపు ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు NHAI, టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇక సంక్రాంతి రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా వద్ద మరో రెండు టోల్ బూత్ లను తెరవాలని అధికారులు యోచిస్తున్నారు.






