- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డికి NHAI రూ.6119 కోట్ల నిధులు
కామారెడ్డి డివిజన్ ఎన్.హెచ్.ఏ.ఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) పరిధిలో విస్తరించిన రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.6,119. 88 కోట్లు మంజూరు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కామారెడ్డి డివిజన్ ఎన్.హెచ్.ఏ.ఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) పరిధిలో విస్తరించిన రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.6,119. 88 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జాతీయ రహదారుల నిర్మాణాలు, గతంలో ఉన్న వాటికి ఆపరేటింగ్ మెయిటేన్సీ కోసం, అత్యంత ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు(బ్లాక్ స్పాట్ ల) గుర్తించి వాటి నివారణకు గత 12 సంవత్సరాల్లో రూ.6,119. 88 ఖర్చు చేసినట్లు గణంకాలు పేర్కొంటున్నాయి. ఇందులో నాగపూర్-హైదరాబాద్ జాతీయ రహదారి-44 కు రెండు చోట్లలో కొత్త రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు కేటాయించిన నిధులు కూడా ఉన్నాయి.
భారత్ మాలా పరియోజనలో మొదటి ప్రాజెక్టు కింద ఎన్.హెచ్-44 బోయిన్ పల్లి నుంచి గుండ్ల పోచంపల్లి వరకు 10.031 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.521 కోట్లు కేటాయించారు. నాలుగు లేన్లు ఉన్న ఈ రోడ్డును 6 లేన్లకు పెంచారు. రెండో ప్రాజెక్టులో గుండ్ల పోచంపల్లి నుంచి కల్లకల్ వరకు 17 కిలోమీటర్ల చొప్పునా నిర్మించేందుకు దాదాపు రూ.900 కోట్లు చొప్పునా కేంద్రం నిధులు కేటాయించింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా4 లేన్ల నుంచి 6 లేన్లకు పెంచారు. మొదటి ప్రాజెక్టకు 2026 ఏప్రిల్ 4 వరకు పూర్తి చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 49.63 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొంటున్నారు. ఇక రెండో ప్రాజెక్టు 2026 జులై 30 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతానికి 35.96 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
కామారెడ్డి డివిజన్ ఎన్.హెచ్.ఏ.ఐ పరిధిలో దాదాపు 100 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారికి ఎప్పటి కప్పుడు మరమ్మతులు చేసేందుకు, బ్లాక్ స్పాట్ లను గుర్తించి వాటి నివారణ చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కేటాయించిన నిధులు ఎన్.హెచ్.ఏ.ఐ కొత్త రోడ్ల నిర్మాణాలు, ఆపరేటింగ్ మెటేన్సీ, బ్లాక్ స్పాట్ ల నివారణకు ఖర్చు చేయిస్తుంది. 2014 నుంచి 2025 వరకు రూ.6119.88 కోట్లు ఖర్చు చేసింది.
కేటాయించిన నిధుల ఇలా






