- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ సర్కార్‌కు షాకిచ్చిన ఎన్జీటీ.. ఆ ప్రాజెక్టు పనులు ఆపాలని ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ (NGT) బిగ్ షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ (NGT) బిగ్ షాకిచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన సొంత నియోజకవర్గంలో ప్రారంభించిన నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చే వరకు స్పాట్‌లో ఎలాంటి పనులు చేపట్టరాదని ఇవాళ స్పష్టమైన ఆర్డర్స్ విడుదల చేసింది. కాగా, నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నారాయణపేట మరియు కొడంగల్ నియోజకవర్గాలకు నీటి పారుదల సౌకర్యాలు కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానుకుర్తి రిజర్వాయర్ అత్యంత కీలక కానుంది. ఆ రిజర్వాయర్‌ను రెండు దశల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానుకుర్తి రిజర్వాయర్ (Kanukurti Reservoir)ను నిర్మించి.. దాని సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రెండు దశల్లో ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రాంతాల్లోని కరువు పీడిత భూములకు సాగునీరు అందించడం, కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి ఆ ప్రాంతాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించాలని సర్కార్ యోచిస్తోంది. అయితే, నారాయణపేట - కొడంగల్ లిఫ్ట ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు సర్వే చేపట్టగా.. స్థానిక రైతులు తీవ్ర వ్యతిరేకిస్తున్న విషయం వదితమే






