అర్బన్ నక్సల్స్‌ చేతిలో విద్యావ్యవస్థ బందీ: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-02-08 16:36:05.0  )
అర్బన్ నక్సల్స్‌ చేతిలో విద్యావ్యవస్థ బందీ: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అర్బన్‌ నక్సల్స్‌ చేతిలో విద్యావ్యవస్థ బందీ అయిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌(Unior Miniter Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన విద్యార్థులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల(Students)కు తుపాకులు ఇచ్చి కొండపల్లి సీతారామయ్య, చంద్రపుల్లారెడ్డిని తయారు చేయాలని చూస్తున్నారన్నారు. విద్యార్థులను అంబేద్కర్‌, పటేల్‌, ఛత్రపతిలా తీర్చిదిద్దేందుకే న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ తెచ్చామన్నారు. గన్నుల రాజ్యం కావాలా.. పెన్నుల రాజ్యం కావాలా అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

నిరుద్యోగులకు నాలుగు వేల భృతి ఇస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీని నెలలో ఇస్తామన్న కాంగ్రెస్…ఇచ్చిందా అని నిలదీశారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్(Congress).. ఇచ్చిందేందో చెప్పాలన్నారు. రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్.. ఇచ్చింది గుండు సున్నానే అని విమర్శిమంచారు. నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తామన్నారని, అది ఏమైందని ప్రశ్నించారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇచ్చింది కూడా సున్నానే అని ఎద్దేవా చేశారు. ఇప్పుడిక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సమయం వచ్చేసిందన్నారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి తెలంగాణ(Telangana) ప్రజలు ఇచ్చేది కూడా గుండు సున్నానే అని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed