- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన బాల్కసుమన్ విచారణ.. నాంపల్లి పీఎస్ వద్ద ఉద్రిక్తత
నాంపల్లి పీఎస్ లో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విచారణ ముగిసింది. ప్రస్తుతం ఆయన్ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు శనివారం తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. మధ్యాహ్నం నుంచి సుమారు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కొద్దిసేపటి క్రితమే బాల్కసుమన్ విచారణ పూర్తి కావడంతో.. వైద్య పరీక్షల కోసం కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు పూర్తయ్యాక మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి.. కస్టడీకి కోరనున్నారు. మరోవైపు బాల్కసుమన్ ను విడుదల చేయాలంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. బాల్కసుమన్ ను ఆస్పత్రికి తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వారందరినీ పోలీసులు చెదరగొట్టి.. వాహనాన్ని ముందుకు పంపారు. పోలీస్ స్టేషన్, ఆస్పత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో.. పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.






