Ramoji Rao: రామోజీరావు భౌతికకాయానికి పవన్ కల్యాణ్ నివాళులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-06-08 13:59:03  IST  )

రామోజీరావు భౌతికకాయానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు..

Ramoji Rao: రామోజీరావు భౌతికకాయానికి పవన్ కల్యాణ్ నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఉంచారు. దీంతో రామోజీరావు పార్థీవదేహాన్ని రాజకీయ, సినీ, టీవీ ప్రముఖులు సందర్శిస్తున్నారు. నివాళులర్పించి ఆయనను స్మరించుకుంటున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. రామోజీరావు పార్థీవదేహానికి నివాళుల్పించారు. రామోజీరావుతో తనకు అనుబంధాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. రామోజీరావు మరణం తీరని లోటన్నారు. ఇక పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు రామోజీరావు పార్థీవదేహాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Next Story