ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం.. కవిత సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-09-09 07:47:24  IST  )

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ నిర్ణయం వేళ కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు  బీఆర్ఎస్ దూరం.. కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి గా గెలవాలని కోరుకుంటున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థి గెలవాలని కోరుకోవడం సానుకూల ప్రాంతీయ వాదం అవుతుందన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డకు అవకాశం వచ్చిందని, సుదర్శన్ రెడ్డి గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ పదవికి వన్నెతెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల్లో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతిలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు. మేమంతా అంతర్గతంగా చర్చించుకున్నాం. తెలంగాణలో ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యంతో అడుగు వేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అయితే ఇవాళ జరుగుతున్న ఉప రాష్ట్రపతి పోలింగ్ కు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్న నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారాయి.

కేసీఆర్ చేయలేని పనులే టార్గెట్!:

సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధించే వరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించరని చెప్పారు. అన్ని వర్గాలకు అవకాశం, స్వేచ్ఛ, సంపద వచ్చేలా తెలంగాణ జాగృతి కృషి చేస్తామన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం సామాజిక తెలంగాణ కోసం లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తామని, మేధావులు కవులు, రచయితల అభిప్రాయాలు తీసుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ హయాంలో చేయకుండా మిలిగిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే సామాజిక తెలంగాణ కోసం కృషి చేసేవారని తాను నమ్ముతున్నాన్నారు. దురదృష్టవశాత్తు ఆ అవకాశం కేసీఆర్ కు రాలేదు. సామాజిక తెలంగాణ ఎజెండాను తెలంగాణ జాగృతి తీసుకుంటుందన్నారు. ఇవాళ కవికు మరణం ఉండదని కవి మరణిస్తే ధృవతారగా అనంతకాలంగా వెలుగొందుతారన్నారు.

గోదావరి ఫేజ్-2,3 పనులలో అంచనాలు పెంచడం ద్వారా మెఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కవిత విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డి ఇంటి సొమ్ము కాదని రాష్ట్ర ప్రజల సొమ్ము అన్నారు. అంచనాలు ఎందుకు పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read More..

BREAKING : ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. తొలి ఓటు వేసిన ప్రధాని

Next Story