- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING : ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. తొలి ఓటు వేసిన ప్రధాని
పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ (Vice President Election) ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ (Vice President Election) ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. ప్రధాని నరేంద్రమోదీ తొలి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి.. ఈ రాత్రికే ఉపరాష్ట్రపతి ఎవరో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు మినహా అన్ని పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో పాల్గొంటున్నాయి. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిలో సుదర్శన్ రెడ్డి తెలుగువ్యక్తి కావడం విశేషం.
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 781 మంది సభ్యులు ఉండగా.. గెలుపుకు 391 ఓట్లు కావాలసి ఉంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ ఏడాది జులై21న జగదీప్ ధన్ ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.






