- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీకి కేసీఆర్.. విమర్శలతో ఇరకాటంలో బీఆర్ఎస్ నేతలు
నీళ్ల పంచాయితీపై ప్రభుత్వాన్ని కడిగేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీసీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్హాజరుకోసమే అసెంబ్లీకి వచ్చారా? ఆరునెలల్లో ఒక్కసారి కూడా సభ రాకుంటే ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల గురించి తెలుసుకుని సభకు అప్పుడప్పుడు వస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఇప్పటి వరకు మూడంటే మూడు సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. శీతాకాల సమావేశాల సందర్భంగా సోమవారం సైతం ఇలా వచ్చి అలా వెళ్లారు. మూడు నిమిషాలు కూడా సభలో ఉండలేదు. దీంతో ఆయన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం సభ జాతీయ గీతాలాపనతో ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి సంతాపం తీర్మానం, వారి గురించి స్పీకర్ చదవడం పూర్తి కాకముందే కేసీఆర్సీట్లో నుంచి వెళ్లిపోయారు. నందినగర్నివాసానికి బయలుదేరారు. ఇదిచూసి సభలో ఉన్న వారు, టీవీల్లో లైవ్‌లో చూస్తున్న వారు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
అంతన్నారు.. ఇంతన్నారు!
మాజీ సీఎం కేసీఆర్అసెంబ్లీకి వస్తున్నారు.. ఇక ప్రభుత్వంపై యుద్ధమే, కాచుకోండి, నదీజలాల గురించి అధికార కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసుడే అంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొట్టారు. అంతన్నారు.. ఇంతన్నారు చివరికి కనీసం సంతాపం తీర్మానం చదివే వరకు కూడా సీట్లో కూర్చోకపోవడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిని చూసైనా అక్కడ ఉండొచ్చు కదా? అంటున్నారు. తాము ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పాలంటూ గులాబీ లీడర్లు, క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. పార్టీ నాయకుడిగా ఆయనను ఎంతగా సమర్థించుకున్నా.. ప్రజలకు అంత ఈజీగా వాటిని ఒప్పుకోరని వ్యాఖ్యానిస్తున్నారు.
సీఎం రేవంత్ హుందాతనం
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి హుందాగా వ్యవహరించి కేసీఆర్వద్దకు వచ్చి కరచాలనం చేశారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కుశలప్రశ్నలు అడిగారు. కానీ కేసీఆర్‌మాత్రం మూడు నిమిషాలు కూడా సీట్లో కూర్చోకుండా వెళ్లిపోవడంతో పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. సోషల్‌మీడియాలో కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమతున్నాయి. మరికొందరు మరో అడుగు ముందుకేసీ కేసీఆర్జీతం తీసుకోవడానికే అసెంబ్లీకి వచ్చారా? అని విమర్శలు ఎక్కుపెట్టారు.
ముచ్చటగా మూడోసారి
ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి అధికార పార్టీని నిలదీయాల్సి ఉండగా అవేవీ చేయకుండా తాను చెప్పిందే వేదంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలో ఒకసారి బడ్జెట్ ప్రసంగం రోజున, మరోసారి గవర్నర్ ప్రసంగం రోజు ముచ్చటగా మూడోసారి సోమవారం శాసనసభ ప్రారంభం రోజున వచ్చి వెళ్లారని చెబుతున్నారు. గతంలో ప్రధాన ప్రతిపక్షనేత ప్రసంగం అధికారపార్టీ సభ్యులు, సీఎం కంటే ఎక్కువ సమయం తీసుకుని ప్రజాసమస్యలపై మాట్లాడేవారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావడమే గగనం అన్నట్లు ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.






