- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర చరిత్రలో తొలిసారి.. సీఎం అధ్యక్షతన పేపర్ లెస్ కేబినెట్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర చరిత్రలో తొలిసారి నేడు పేపర్ లెస్ కేబినెట్ సమావేశం జరగనుంది. పూర్తిగా డిజిటల్ విధానంలోనే ఈ కేబినెట్ భేటీ నిర్వహించనుండటం విశేషం.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర చరిత్రలో తొలిసారి నేడు పేపర్ లెస్ కేబినెట్ సమావేశం జరగనుంది. పూర్తిగా డిజిటల్ విధానంలోనే ఈ కేబినెట్ భేటీ నిర్వహించనుండటం విశేషం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్, అజీవికా మిషన్–గ్రామీణ్ అమలుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల పంపిణీపై కీలకంగా చర్చించనున్నారు. ఎల్‌నినో ప్రభావం, రుతుపవనాల మందగమనం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తనాలు, ఎరువుల అందుబాటుపై ప్రభుత్వం కార్యాచరణను ఖరారు చేయనుంది. ఇక విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ డీపీఆర్‌కు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంతోపాటు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీల అంశంపైనా చర్చ జరగనుంది. అలాగే.. హైదరాబాద్‌లో ఎల్‌ఐజీ హౌసింగ్ స్థలాలు, డిజైన్ల ఆమోదం, మరికొన్ని ప్రజా సంక్షేమ ప్రతిపాదనలకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.






