'చెన్నై లవ్ స్టోరీ' లవ్ కార్నివల్ ఈవెంట్.. తేదీ, వేదిక ఖరారు

by Pulgam srinivas |

'చెన్నై లవ్ స్టోరీ' మూవీ బృందం జూలై 4న విజయవాడలో 'లవ్ కార్నివల్' ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

చెన్నై లవ్ స్టోరీ లవ్ కార్నివల్ ఈవెంట్.. తేదీ, వేదిక ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్., సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 24న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించింది.

'లవ్ కార్నివల్' పేరుతో ప్రత్యేక ఈవెంట్‌ను జూలై 4న సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, చిత్రబృందం కూడా సినిమా అద్భుతంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి విడుదల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.




Next Story