- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మరోసారి ఏసీబీ రైడ్స్ కలకలం.. డీఎస్సీ ఇంట్లో సోదాలు
తెలంగాణలో ఏసీబీ భారీ దాడులు.. డీజీపీ ఆఫీస్ డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇల్లు సహా 20 చోట్ల ఏకకాలంలో సోదాలు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు!

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా తెలంగాణలోని అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా అక్రమాస్తులను కూడబెట్టినట్టు సమాచారం ఉన్న కీలక అధికారులు ఇళ్లపై దాడులు చేస్తూ వందల కోట్ల రూపాయలను గుర్తించి వారిని జైలుకు పంపుతోంది. ఈ క్రమంలోనే మరో అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం తెల్లవారుజామున డీఎస్సీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పని చేశారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లో కంప్యూటర్ సర్వీసెస్ లో డీఎస్సీ గా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. నార్సింగిలోని వేసెల్లా మెడోస్ లోని భీమ్ రెడ్డి ఇల్లు సహా రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి.. సోదాలు చేస్తున్నారు. కాగా ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






