వయసు పెరిగినా ఫిజిక్‌లో తగ్గేదేలే.. శ్రియా గ్లామర్ షో

by Pulgam srinivas |

సైడ్ వ్యూలో సెగలు రేపిన శ్రేయ.

వయసు పెరిగినా ఫిజిక్‌లో తగ్గేదేలే.. శ్రియా గ్లామర్ షో
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ బ్యూటీ శ్రేయ శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో నటించి దేశవ్యాప్తంగా విశేష గుర్తింపును సంపాదించుకుంది.




ముఖ్యంగా తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రేయ, ఎన్నో ఏళ్ల పాటు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు తగ్గినా, ప్రాధాన్యమున్న కీలక పాత్రల్లో నటిస్తూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.




సినిమాల్లో ఇటీవల గ్లామర్ షోకు కొంత దూరంగా ఉంటున్న శ్రేయ, సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులను నిరాశపరచడం లేదు. ఎప్పటికప్పుడు స్టైలిష్, గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.




వయసు పెరిగినా ఏమాత్రం తగ్గని అందంతో యువ హీరోయిన్లకే గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా ఈ సీనియర్ బ్యూటీ పలుచటి పింక్ కలర్ చీరలో మెరిసింది. భారీ ఎంబ్రాయిడరీతో అలరించిన బ్లౌజ్ ధరించి, చీర పల్లును కాస్త పక్కకు జరిపి ఎద అందాలతో పాటు సైడ్ యాంగిల్‌లో బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా స్టైలిష్‌గా పోజులిచ్చింది.




ఒకవైపు ముఖంపై పడేలా జుట్టును వదిలేసి, పెద్ద ఇయర్‌రింగ్స్‌తో పాటు క్యూట్ స్మైల్‌తో తన లుక్‌కు మరింత అందాన్ని జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story