త్రిష సీక్రెట్ చెప్పినందుకు ఏమనుకోదని ఆశిస్తున్నా.. విష్ణు విశాల్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

తాను ఈ విషయాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎక్కడా చెప్పలేదని, ఇది చాలా ప్రత్యేకమైన విషయమని అన్నారు.

త్రిష సీక్రెట్ చెప్పినందుకు ఏమనుకోదని ఆశిస్తున్నా.. విష్ణు విశాల్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ‘గట్టి కుస్తీ-2’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గట్ట కుస్తీ’ కి సీక్వెల్‌గా రాబోతుంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా , మరికొన్ని గంటల్లో అంటే జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు విశాల్, స్టార్ హీరోయిన్ త్రిష వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్‌ను బయటపెట్టారు. విష్ణు విశాల్ మాట్లాడుతూ.. తాను ఈ విషయాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎక్కడా చెప్పలేదని, ఇది చాలా ప్రత్యేకమైన విషయమని అన్నారు. ప్రస్తుతం హీరోయిన్ త్రిష దగ్గర ఉన్న పెంపుడు కుక్క, తన సొంత కుక్క అయిన 'టెడ్డీ' కూతురేనని విష్ణు విశాల్ నవ్వుతూ వెల్లడించారు. అది 'పూడిల్' జాతికి చెందిన చాలా ఖరీదైన, క్యూట్ కుక్క అని చెప్పారు.

తన భార్య జ్వాలా గుత్తా, త్రిష ఇద్దరూ చాలా మంచి స్నేహితులని.. వారిద్దరూ కలిసినప్పుడల్లా తరచుగా కుక్కల గురించే మాట్లాడుకుంటూ ఉంటారని తెలిపారు. అయితే ఆమె కుక్క గురించిన ఈ పర్సనల్ విషయాన్ని తాను ఇలా బయటపెట్టినందుకు త్రిష ఏమీ అనుకోదని ఆశిస్తున్నట్లు విష్ణు విశాల్ సరదాగా చెప్పుకొచ్చారు.నిజానికి హీరోయిన్ త్రిషకు కుక్కలంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. తన పెంపుడు కుక్కలతో దిగిన ఫొటోలను ఆమె తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవల తన వ్యక్తిగత విషయాలపై నెట్టింట ట్రోల్స్ చేసిన వారికి త్రిష గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. తన పర్సనల్ లైఫ్‌లో జోక్యం చేసుకోవడానికి కేవలం తన పెట్ డాగ్‌కు మాత్రమే పర్మిషన్ ఉందంటూ ట్రోలర్ల నోళ్లు నొక్కేశారు. దీన్ని బట్టే ఆమెకు కుక్కలంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విష్ణు విశాల్ చెప్పిన ఈ సరికొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story