- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడవాళ్లు లేనిది జీవితమే లేదు.. గ్లామల్ బొమ్మల్లా కాకుండా గౌరవం ఇచ్చే పాత్రలు రాయండి: అదితి రావు హైదరీ
అయితే, మహిళలు లేని జీవితం లేదు కాబట్టి ఆడవాళ్లు లేని కథలు ఎప్పటికీ పూర్తి కావని, అందుకే ఆ రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదని అదితి స్పష్టం చేశారు.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లైన తర్వాత కాస్త సినిమాలను తగ్గించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా అచీతూచీ అడుగులు వేస్తున్నారు. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నప్పటికీ ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి. అయినప్పటికీ అదితి నిరాశ చెందకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల ‘గాంధీ టాక్స్’ మూవీతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి ఆసక్తికర కామెంట్లు చేశారు. భారతీయ సినిమాల్లో మహిళల పాత్రలు, వారికి ఇచ్చే ప్రాధాన్యత మెల్లమెల్లగా మారుతోందని అదితి రావ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మార్పు దానంతట అదే రాదని.. నటీనటులు, దర్శకులు కలిసి మంచి కథలను సపోర్ట్ చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కాబట్టి దర్శకులు తమను నమ్మి, నిజాయితీతో కథలు చెబితే అది ఎప్పటికైనా గొప్పగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. సినిమాలో మహిళా పాత్రలను కేవలం గ్లామర్ కోసమే కాకుండా, వారికంటూ ఒక ప్రత్యేకత, గౌరవం ఉండేలా రాయాలని అదితి రావ్ హైదరి కోరారు.
ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఒక రిస్క్‌గా చూస్తున్నారని ఆమె అన్నారు. అయితే, మహిళలు లేని జీవితం లేదు కాబట్టి ఆడవాళ్లు లేని కథలు ఎప్పటికీ పూర్తి కావని, అందుకే ఆ రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదని అదితి స్పష్టం చేశారు. అదే విధంగా హీరోయిన్లు కూడా కేవలం డబ్బు కోసమే కాకుండా భవిష్యత్తును ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అదితి అన్నారు. మనస్సాక్షికి నచ్చని పాత్రలు వచ్చినప్పుడు ధైర్యంగా నో చెప్పడం కూడా చాలా ముఖ్యమని ఆమె తెలిపారు. తనకు ఎప్పుడూ మూవీ, అందులోని నటన మాత్రమే ముఖ్యం అని.. సరైన కథలను ఎంచుకుంటూ పోతే మంచి అవకాశాలు అవే వస్తాయని చెప్పారు. సినిమా రంగంలో రాణించాలంటే క్రమశిక్షణ, అంకితభావం చాలా అవసరమని అన్నారు. కేవలం విజయాలు, అవార్డుల కోసమే కాకుండా నటనపై శ్రద్ధ పెట్టడమే తనకు ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






