సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘జననాయగన్’ అప్డేట్.. పండుగ చేసుకుంటున్న విజయ్ అభిమానులు!

by Mallepaka Hamsa |

అన్ని అడ్డంకులను దాటుకుని ‘జననాయగన్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘జననాయగన్’ అప్డేట్.. పండుగ చేసుకుంటున్న విజయ్ అభిమానులు!
X

దిశ, సినిమా: తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ‘జననాయగన్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ, చిత్ర నిర్మాతలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మధ్య తలెత్తిన కొన్ని వివాదాలు, సమస్యల కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాకుండా, ఈ మధ్య కాలంలో సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సీన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం చిత్రబృందాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

దీంతో వెంటనే అలర్ట్ అయిన మేకర్స్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. సినిమా రిలీజ్ పదే పదే వాయిదా పడుతుండటంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘జననాయగన్’కు సంబంధింది సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అన్ని అడ్డంకులను దాటుకుని ‘జననాయగన్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ సినిమాను జులై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అంతేకాకుండా, ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని సమాచారం. సినిమాలో ఉన్న పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు నెట్టింట పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న తమ ప్రియతమ నటుడి చివరి సినిమా థియేటర్లలోకి రాబోతుందనే వార్త తెలియడంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు.

Next Story