- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్మన్‌ఘాట్ ఆలయంలో హీరో విరాట్ కర్ణ ప్రత్యేక పూజలు!
పెదకాపు చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన యువ కథానాయకుడు, ప్రస్తుతం నాగబంధం చిత్రంలో నటిస్తున్న హీరో విరాట్ కర్ణ గురువారం ఉదయం కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయంను దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ,చంపాపేట్: పెదకాపు చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన యువ కథానాయకుడు, ప్రస్తుతం నాగబంధం చిత్రంలో నటిస్తున్న హీరో విరాట్ కర్ణ గురువారం ఉదయం కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయంను దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించగా, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా విరాట్ కర్ణ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తున్నానని, ఈ క్షేత్రంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఆలయంలో కొంతసేపు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు కొత్త ఉత్సాహం లభిస్తుందని అన్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘నాగబంధం’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే తనకు పెద్ద బలమని, వారి ఆశీర్వాదాలతో సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. హీరో ఆలయ దర్శనానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వారితో ఆప్యాయంగా పలకరించిన విరాట్ కర్ణ సెల్ఫీలు దిగుతూ అభిమానుల అభివాదాలు స్వీకరించారు.






