పదే పదే చెప్పినా వినకుండా నా శరీర భాగాలను చూపిస్తున్నారు.. నేహా ధూపియా ఫైర్

by Mallepaka Hamsa |

మీలో ఎవరు నన్ను వెనక వైపు నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు అని ప్రశ్నించిన ఆమె, ఎందుకు అలా చేస్తున్నారని నిలదీశారు.

పదే పదే చెప్పినా వినకుండా నా శరీర భాగాలను చూపిస్తున్నారు.. నేహా ధూపియా ఫైర్
X

దిశ, సినిమా: పెద్ద పెద్ద ఫంక్షన్లకు సెలబ్రిటీలు వచ్చినప్పుడు అభిమానులు, ఫొటోగ్రాఫర్లు వాళ్లను తమ ఫోన్లలో, కెమెరాల్లో ఫొటోలు తీయడం మనం చూస్తూనే ఉంటాం. సెలబ్రిటీలు కనిపించడం పాపం.. అభిమానులు, ఫొటోగ్రాఫర్లు ఫోన్లలో ఫొటోలు, వీడియోల తీసి నెట్టింట వైరల్ చేసేస్తున్నారు. హీరోయిన్లు ఏం చేసినా.. పెద్ద సంచలనంగా మారుతుంది. అయితే, కొంతమంది ఫొటోగ్రాఫర్లు మాత్రం హీరోయిన్లను తప్పుడు యాంగిల్స్‌లో చూపిస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా బాలీవుడ్ నటి నేహా ధూపియాకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ముంబై ఈవెంట్‌లో పాల్గొన్న నేహాను కొందరు తప్పుడు కోణంలో ఫొటోలు తీయడంతో అది గమనించిన ఆమె వారిపై మండిపడ్డారు. మీలో ఎవరు నన్ను వెనక వైపు నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు అని ప్రశ్నించిన ఆమె, ఎందుకు అలా చేస్తున్నారని నిలదీశారు.

ఒక్క నన్నే కాదు.. ఏ హీరోయిన్‌ని కూడా వెనక నుంచి అలా ఫొటోలు తీయవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.తాము బ్యాగులు సర్దుకుంటున్నా, పుస్తకాలు తీసుకుంటున్నా, చివరకు రోడ్డుపై మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నా కూడా కొందరు వెనక నుంచి వీడియోలు తీస్తున్నారని నేహా ధూపియా ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే చెప్పినా వినకుండా, కేవలం శరీర భాగాలను చూపించేలా కెమెరాలు పెట్టడం అస్సలు బాలేదన్నారు. హీరోయిన్లు మీడియాతో ఎంతో గౌరవంగా మాట్లాడుతారని, కాబట్టి మీడియా వాళ్లు కూడా తమకు అంతే మర్యాద ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం నేహా ధూపియా మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. సెలబ్రిటీలైనా సరే వాళ్లకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, ఇలాంటి పనులు చేయడం తప్పు అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story