- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యో పాపం.. ఇనుప బ్యారికేడ్‌లో ఇరుక్కున్న అడవి ఏనుగు
ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ అడవి ఏనుగు తిరిగి వెళ్లే క్రమంలో ఇనుప బ్యారికేడ్‌లో ఇరుక్కుపోయిన ఘటన కర్ణాటకలోని కనకపుర తాలూకా అరేకొప్ప గ్రామం సమీపంలో చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ అడవి ఏనుగు తిరిగి వెళ్లే క్రమంలో ఇనుప బ్యారికేడ్‌లో ఇరుక్కుపోయిన ఘటన కర్ణాటకలోని కనకపుర తాలూకా అరేకొప్ప గ్రామం (ముగ్గూరు రేంజ్) సమీపంలో చోటు చేసుకుంది. కావేరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని బోని హెక్కలు అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి పొలాల్లోకి వచ్చిన ఈ ఏనుగు.. తిరిగి అడవిలోకి వెళ్తుండగా మానవ-వన్యప్రాణి సంఘర్షణను నివారించేందుకు ఏర్పాటు చేసిన రైల్వే బ్యారికేడ్ల మధ్య ఇరుక్కుపోయి కదలలేకపోయింది. బుధవారం వేకువజామున ఏనుగును గమనించిన స్థానికులు అయ్యో పాపం అనుకోని వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, బన్నేరుఘట్ట ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పశువైద్యులు దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి సహాయక చర్యలు చేపట్టారు.
ముందుగా ఏనుగుకు మత్తుమందు (ట్రాంక్విలైజర్) ఇచ్చి, అది ఇరుక్కున్న ఇనుప కడ్డీలను కట్ చేసి బయటకు తీశారు. బ్యారికేడ్ల మధ్య ఇరుక్కోవడం వల్ల స్వల్పంగా గాయపడిన ఆ ఏనుగుకు అక్కడే చికిత్స అందించారు. కొంత సమయం పాటు అధికారుల పరిశీలనలో ఉంచిన అనంతరం, అది పూర్తిగా కోలుకోవడంతో సురక్షితంగా తిరిగి అడవిలోకి విడిచిపెట్టారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.






