అయోధ్య విరాళాల చోరీ కేసులో ట్విస్ట్.. ట్రస్ట్ సభ్యులపై ఫిర్యాదు చేసిన లాయర్లు

by Ajay Maddhiboyina |

అయోధ్య రామాల‌యం విరాళాల కేసులో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులపై లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపత్ రాయ్ సహా ఇతర సభ్యులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లాయర్లు కోరారు.

అయోధ్య విరాళాల చోరీ కేసులో ట్విస్ట్.. ట్రస్ట్ సభ్యులపై ఫిర్యాదు చేసిన లాయర్లు
X

దిశ‌, వెబ్ వెబ్: అయోధ్య రామాల‌యం విరాళాల కేసులో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులపై లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపత్ రాయ్ సహా ఇతర సభ్యులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లాయర్లు కోరారు. చంపత్ రాయ్ అనిల్ మిశ్రాతో పాటు నలుగురి పేర్లను ఫిర్యాదులో ప్రస్తావించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. మరోవైపు నిందితుల తరుఫున వాదించేది లేదని ఇప్పటికే అయోధ్య బార్ అసోసియేషన్ సైతం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అయోధ్య విరాళాల ఐదేళ్ల ఖాతాలను ఆడిట్ చేయాలని నిర్ణయించారు.

ఇక ఇప్ప‌టికే యూపీ ప్ర‌భుత్వ విరాళాల చోరీపై సిట్ విచార‌ణ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో త‌వ్వేకొద్ది షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కుంభ‌మేళా స‌మ‌యంలో అత్యధిక మొత్తంలో విరాళాలు దోచుకున్న‌ట్టు ద‌ర్యాప్తులో తేలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, స్థిర‌, చ‌రాస్తుల‌పై ఆరా తీస్తున్నారు. నిందితుల ఇళ్ల‌లో చేసిన త‌నిఖీల్లో వారి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌ని పోలీసులు గుర్తించారు. సోదాల్లో విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు, విదేశీ కెరన్సీ కూడా ల‌భించిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు లాయ‌ర్లు ట్ర‌స్ట్ స‌భ్యులు అంద‌రిపై కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదు చేయ‌డంతో కేసుపై మ‌రింత ఉత్కంఠ నెల‌కొంది.

Next Story