- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్జించిన భారత నౌకాదళం.. పైరేట్ల ఆట కట్టించిన INS త్రికంద్
గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో భారత నౌకాదళం (Indian Navy) సముద్రపు దొంగలను ఓ ఆట ఆడుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ ఆఫ్ ఆడెన్ (Gulf of Aden) సముద్ర తీరంలో భారత నౌకాదళం (Indian Navy) మరోసారి తన ప్రతాపాన్ని చాటింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ వాణిజ్య నౌకపై జరిగిన సముద్రపు దొంగల (Pirates) దాడి ప్రయత్నాన్ని భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికంద్ (INS Trikand) విజయవంతంగా తిప్పికొట్టింది. అయితే, భారత్‌కు చెందిన అత్యంత కీలకమైన సరుకుతో (Critical Cargo) ప్రయాణిస్తున్న ఎమ్‌వీ గోల్డెన్ ఆర్సెనల్ (MV Golden Arsenal) అనే వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని సముద్రపు దొంగలు దాడికి తెగబడ్డారు. ఈ నౌకలో ఓ భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. పైరేట్లు నౌకపైకి వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై, నౌకలోని ఒక సురక్షిత గదిలో (Safe Room) దూరి లోపలి నుంచి లాక్ చేసుకున్నారు. అనంతరం కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా తమకు ఎదురైన ప్రమాదం గురించి భారత నౌకాదళానికి సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన మార్కోస్ కమాండోలు..
కాగా, సమాచారం అందుకున్న వెంటనే వెంటనే గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో గస్తీ కాస్తున్న భారత యుద్ధనౌక ‘INS త్రికంద్’ మెరుపు వేగంతో సదరు వాణిజ్య నౌక వైపు దూసుకెళ్లింది. భారత నావికాదళ యుద్ధనౌక తమ వైపు రావడం చూసిన సముద్రపు దొంగలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఇండియన్ నేవీకి చెందిన స్పెషల్ ఫోర్సెస్ మార్కోస్ (MARCOS - Marine Commandos) రంగంలోకి దిగి, ఎమ్‌వీ గోల్డెన్ ఆర్సెనల్ నౌకలోకి ప్రవేశించి సిబ్బందిని కాపాడినట్లుగా ధృవీకరించారు.






