మహబూబాబాద్‌లో రోడ్డు ఆక్రమణల తొలగింపు

by Ratna Kumari |

మహబూబాబాద్ పట్టణంలో రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

మహబూబాబాద్‌లో రోడ్డు ఆక్రమణల తొలగింపు
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ పట్టణంలో రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు, అక్కడి నుంచి వివేకానంద సెంటర్ వరకు రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, ప్రకటన బోర్డులు, వ్యాపార సామగ్రి, ఇతర అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. దీంతో రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలు తొలగిపోయాయి. అనంతరం మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాపారులు, దుకాణ యజమానులు తమకు కేటాయించిన స్థల పరిమితుల్లోనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. రహదారులను ఆక్రమించకుండా మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీఓ సాయిరాం, టౌన్ సీఐ రఘుపతి రెడ్డి, టీపీఎస్ వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్, పుష్పరాజ్, తల్లు, శ్రీనివాస్, జవాన్ పర్నంది కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story