- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుధ్యం పై పట్టింపు కరువు..!
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ప్రధాన రహదారి పక్కన మురికి నీరు కుంటల తలపిస్తూ అందులోనే ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది.

దిశ, ఎల్లారెడ్డి: వర్షాకాలం ఎప్పుడు ఒంటరిగా రాదు. తోడుగా అనేక వ్యాధులను తీసుకొస్తుంది మొదట్లోనే ఆ రుగ్మతలను అడ్డుకుంటే సరి లేదంటే.. ప్రతి ఇంటి తలుపును అవి తడతాయి అలుసు ఇచ్చి గుమ్మం దాటి లోపలికి రానిచ్చామా.. ఇక అంతే సంగతులు. మన మీదే ప్రతాపం చూపుతాయి. అయితే వాటిని తరిమి కొట్టడం ఆషామాషీ కాదు అలాగని అసాధ్యమైన పని కూడా కాదు అప్రమత్తమై పరిశుభ్రత పాటిస్తే మంచిది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అనేది మన చేతిలో ఉంటుంది కానీ. మన చుట్లూ పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల్సిన వారు ఆ విషయాన్ని పట్టించుకోకుంటే పరిస్థితి ఏమిటి? ఇంకేముంది. గంపగుత్తగా రోగాలను ఆహ్వానించడమే.
మరి ఆ ప్రయత్నం ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతుందా అంటే లేదనే సమాధానమే వస్తుంది వ్యాధుల కాలం ముంచుకొస్తున్న అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తమైనట్లు కనిపించడం లేదు.. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ప్రధాన రహదారి పక్కన మురికి నీరు కుంటల తలపిస్తూ అందులోనే ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అంతే కాకుండా దోమలు ప్రబలుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు చెబుతున్న అధికారులే అందుకు అనుగుణంగా వ్యవహరించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వ్యాధులకు కారణమయ్యే అపరిశుభ్రతను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. నీటి గుంతలలో నీరు దిగువకు పంపి గుంతలను పూడ్చి వేయాలని బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఫాగింగ్ చేయాలని ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలాంటివేమీ ఎక్కడ అమలు కావడం లేదు. మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలోనూ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది.






